: బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే: కేసీఆర్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటువేస్తే మోరీలో వేసినట్టేనని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తనకు అందిన సమాచారం మేరకు టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని అన్నారు. వారి విజయం నల్లేరుపై నడకేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్సీలు గెలిచినా ఉపయోగం లేదని, వారిద్దరూ ఏమీ చేయలేరని ఆయన పేర్కొన్నారు. తాము ఎవరి గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం లేదని ఆయన చెప్పారు. దేవీ ప్రసాద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.