: పట్టిసీమకు తెలంగాణ సర్కారు అనుమతి తీసుకోవాలట!
ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాయలసీమకు నీరు అందించేందుకు ఉద్దేశించిన ఆ ప్రాజెక్టు నిర్మించాలంటే తమ అనుమతి తప్పనిసరి అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేసీఆర్ అధ్యక్షతన సోమవారం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. గోదావరి నదిపై ఏపీ సర్కారు పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ వద్ద భారీ ఎత్తిపోతల పథకానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.