: తెలుగు ప్రజలకు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలి: కంభంపాటి
తెలుగు ప్రజలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి, టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలకు కేంద్రం న్యాయం చేస్తానంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను బీజేపీ ఇస్తానంటే వీరప్ప మెయిలీ ఎందుకు ఆక్రోశం వెళ్లగక్కారని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, లోటు బడ్జెట్, రాజధాని నిర్మాణం విషయాల్లో ఎన్డీయే గవర్నమెంట్ సహకరిస్తుందని పూర్తిగా విశ్వసిస్తున్నానని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, ఆ రాష్ట్ర ప్రయోజనాలను కూడా కాలరాస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కుతారు, రాష్ట్రంలో హోదా కావాలంటూ ఆ పార్టీ వారే ఆందోళన చేస్తారు... ఇదెక్కడి చోద్యమని ఆయన ప్రశ్నించారు.