: ఐఏఎస్ అధికారి అనుమానాస్పద మరణం
బెంగళూరులో డీకే రవి అనే ఐఏఎస్ అధికారి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. నగరంలోని కోరమంగళ ప్రాంతంలో ఉన్న సెయింట్ జాన్స్ ఉడ్స్ అపార్ట్ మెంట్లోని తన నివాసంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. సీలింగ్ కు వేలాడుతూ మృతదేహం కనిపించింది. ఆయన 2009 బ్యాచ్ కి చెందిన అధికారి అని తెలిసింది. కాగా, గత కొంతకాలంగా ఆ అధికారికి ఇసుక మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, ఆయన మరణంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. బిల్డర్లు, ఇసుక మాఫియా పన్ను ఎగవేత దందాలను ఆయన ధైర్యంగా ప్రతిఘటించి, అక్రమాలను వెలుగులోకి తెచ్చారు.