: బీసీీసీఐ తాజా నిర్ణయంతో కోహ్లీకి పండగేనా?
టీమిండియా క్రికెటర్లకు ఊరట. వరల్డ్ కప్ లో ఆడుతున్న భారత క్రికెటర్లకు కంపెనీ ఇచ్చేందుకు వారి భార్యలు, గాళ్ ఫ్రెండ్స్ ను అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. వరల్డ్ కప్ కు ముందు భాగస్వాములను, స్నేహితురాళ్లను క్రికెటర్లతో కలిసేందుకు అంగీకరించని బీసీసీఐ... ధోనీ సేన క్వార్టర్ ఫైనల్ చేరిన నేపథ్యంలో ముందు చెప్పినట్టుగా తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంది. కాగా, విదేశీ టూర్ అంటే ప్రేయసి అనుష్క శర్మను వెంటేసుకుని వెళ్లేందుకు ఇష్టపడే వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ నిర్ణయం సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్లో ఆటగాళ్లు చికాకులకు దూరంగా ఉండాల్సిన అవసరముందని బీసీసీఐ తొలుత భావించినా, తాజాగా తన ఆలోచన మార్చుకున్నట్టు కనిపిస్తోంది.