: నన్ అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరపాలి: బీజేపీ డిమాండ్
పశ్చిమ బెంగాల్ లో క్రైస్తవ సన్యాసినిపై సామూహిక అత్యాచారం చేసి, 12 లక్షల రూపాయలు దోచుకుపోయిన ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కోల్ కతాలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతూ, ఘటన జరిగి రెండు రోజులు కావస్తున్నా రాష్ట్ర పోలీసులు నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్ర పోలీసులను నమ్ముకోవడం కంటే సీబీఐని నమ్ముకోవడం మంచిదని వారు సూచించారు. తక్షణం సీబీఐ విచారణకు ఆదేశించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కేసులో పది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. కాగా, బాధిత క్రైస్తవ సన్యాసిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కామాంధుల చర్యతో తన గుండె బద్దలైనప్పటికీ, ఆమె కరుణ ప్రదర్శిస్తూ వారిని క్షమించాలని సూచించారు.