: సీఎం చంద్రబాబు ఆ విషయలో ఎన్నారైల సూచనలు కూడా తీసుకుంటారు: నారా రోహిత్
యువ నటుడు నారా రోహిత్ ను అమెరికాలో ఘనంగా సన్మానించారు. కాలిఫోర్నియాలోని బే ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ ఎన్నారై నేతలు రోహిత్ కు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడాడు. ఏపీ కొత్త రాజధాని నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబునాయుడు ఎన్నారైల సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటారని అన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడంలో ఎన్నారైల సహకారం మరువలేనిదని తెలిపారు. ఇక, బే ఏరియాలో అధిక సంఖ్యలో ఉన్న ఎన్నారైలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ ఎన్నారై నేతలు పాల్గొన్నారు.