: ఎమ్మార్పీఎస్ కు హితవు పలికిన రావెల కిషోర్ బాబు
అసెంబ్లీ ముట్టడి నిర్ణయం సరికాదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమకారులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు హితవు పలికారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ మాదిగ రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని అన్నారు. పదేపదే చెబుతున్నా ఎమ్మార్పీఎస్ నేతలు వినిపించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలోని అంశాలు కాదని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్లపై టీడీపీ మాత్రమే చెబితే సరిపోదని, ఇతర రాష్ట్రాలను కూడా ఎమ్మార్పీఎస్ ఒప్పించాలని ఆయన సూచించారు.