: హెరిటేజ్ పాలు తాగేవాళ్లే టీడీపీలో ఉన్నారు: నాయిని


హెరిటేజ్ పాలు తాగుతున్న వాళ్లే టీడీపీలో ఉన్నారని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా టీడీపీ నేత పార్టీలో చేరిన సందర్భంగా టీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్ కు తప్ప మరే పార్టీకి పుట్టగతులు ఉండవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా పార్టీగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం ఆ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ ఊపిరి మిగిలి ఉందని అన్నారు. కేసీఆర్ మొనగాడని, ఆయనను ఎవరూ ఓడించలేరని నాయిని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని గుర్తించిన విపక్ష నేతలు కారెక్కుతున్నారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News