: ఆప్ మీద కోపం సామాన్యుల మీద చూపిస్తే ఎలా?: కవిత
ఢిల్లీలో వ్యతిరేక ఫలితాలు వచ్చినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉన్న కోపం సామాన్య ప్రజానీకం మీద చూపిస్తే ఎలా? అని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అలా కోపం ప్రదర్శించరాదని అన్నారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆమె లోక్ సభలో మాట్లాడుతూ, ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ బడ్జెట్ అన్నారు. ఆరోగ్య రంగానికి 1.32 నుంచి 1 శాతం నిధులు తగ్గించారని అన్నారు. బడ్జెట్ కేటాయింపులపైనా ఆమె విమర్శలు చేశారు. అది పేదల మేలుకోరే బడ్జెట్ కాదన్నారు.