: టీచర్ కు ఆరు కోట్ల ప్రైజ్ మనీ... చివరి వరకు పోటీ ఇచ్చిన గుజరాత్ టీచర్


బోధనా రంగంలో నోబెల్ ప్రైజ్ గా భావించే 'వార్కీ ఫౌండేషన్' గ్లోబల్ టీచర్ అవార్డును అమెరికా ఉపాధ్యాయురాలు నాన్సీ అట్వెల్ సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ఎడ్గేకాంబ్ లోని 'ది సెంటర్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్' సంస్థలో ఉపాధ్యాయురాలిగా నాన్సీ అట్వెల్ విధులు నిర్వర్తిస్తున్నారు. వార్కీ ఫౌండేషన్ గ్లోబల్ టీచర్ అవార్డు విలువ ఒక మిలియన్ డాలర్లు. అంటే, ఆరు కోట్ల రూపాయలకు పైమాటే. అట్వెల్ తరువాతి స్థానంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన కిరణ్ బిర్ సేథీ నిలిచారు. బోధనా రంగంలో అత్యున్నత విలువలు పాటించి, ఉత్తమ నైపుణ్యాలు ప్రదర్శించిన వారికి వార్కీ ఫౌండేషన్ గ్లోబల్ టీచర్ అవార్డును అందజేస్తారు.

  • Loading...

More Telugu News