: భారత్ బౌలింగ్ కాస్త బలహీనం... దానిపైనే దృష్టిపెడతాం: బంగ్లా కోచ్
వరల్డ్ కప్ లో టీమిండియాతో బంగ్లాదేశ్ జట్టు క్వార్టర్ ఫైనల్లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బంగ్లా జట్టు కోచ్ ఛండిక హతురుసింఘే మాట్లాడుతూ... భారత జట్టు బ్యాటింగ్ బాగుందని, అయితే, బౌలర్లు ఎలా రాణిస్తారన్న దానిపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్ తో పోల్చితే భారత బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్న నేపథ్యంలో తాము ఆ అంశంపైనే దృష్టి పెడతామని అన్నారు. ఇక, తాము ఇంగ్లండ్ ను చిత్తుచేసి నాకౌట్ దశకు చేరడంపై వ్యాఖ్యానిస్తూ, తాము ఎవరికీ, దేన్నీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మంచి జట్టు కాబట్టే క్వార్టర్ ఫైనల్ చేరామని పేర్కొన్నారు.