: హైదరాబాదులో కొన్నాళ్లుగా ట్రాఫిక్ చలానా చెల్లించని వారిపై ఛార్జ్ షీట్
హైదరాబాదులో ట్రాఫిక్ చలానా చెల్లించని వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కొన్నాళ్ల నుంచి నగరంలో ఇ-చలాన్లు పెండింగ్ లో ఉన్నా పట్టించుకోని వాహనదారులపై ఎర్రమంజిల్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైంది. ఈ క్రమంలో 150 మందికి పైగా వాహనదారులకు కోర్టు జరిమానా విధించింది. అయితే, ప్రథమ తప్పిదంగా భావించి జరిమానాలతో సరిపెడుతున్నామని జడ్జి పేర్కొన్నారు. ఇలాంటిదే మరలా పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, వారిలో 80 మంది ప్రాసిక్యూషన్ కు అధికారులు అనుమతి తీసుకున్నారు.