: టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ నేత చిన్నపరెడ్డి
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మరోవైపు, టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. టీడీపీ నుంచి తేరా చిన్నపరెడ్డి ఈరోజు టీఆర్ఎస్ లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, మహేందర్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చిన్నపరెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా అంబర్ పేటకు చెందిన పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.