: లక్ష్మిదేవిపై రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్లు


ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనాలకు మారుపేరు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయడం... సంచలనానికి కేంద్ర బిందువుగా మారడం... ఇదీ వర్మ స్టైల్. అలాంటి వర్మ ఇప్పుడు మరో వివాదానికి తెరతీశారు. "లక్ష్మిదేవిని పూజించని అమెరికాలో మనకన్నా ఎక్కువ డబ్బుందంటే... అది లక్ష్మిదేవి లోపమా? లేక తనని పూజించే మన మూర్ఖత్వమా?" అని ట్విట్టర్లో ప్రశ్నించారు. ఇదే సమయంలో... యాపిల్ ఫోన్లు, యాపిల్ వాచ్ లు, యాపిల్ కార్లు, ఇలా ఆ కంపెనీ అన్నీ తయారు చేస్తోందని... ఇదే విధంగా యాపిల్ కంపెనీ మహిళలను కూడా తయారు చేయాలని తాను సిన్సియర్ గా కోరుకుంటున్నట్టు తెలిపాడు.

  • Loading...

More Telugu News