: చంద్రబాబుకు సవాల్ విసిరిన బొత్స
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంగ్రెస్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. చంద్రబాబు చెబుతున్నట్టు పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలం కాబోదని, ఆ ప్రాంత జిల్లాలకు ఒక్క చుక్క నీరు కూడా రాదని అన్నారు. ఈ విషయంపై చర్చించేందుకు చంద్రబాబు సిద్ధమేనా? అంటూ బొత్స సవాల్ విసిరారు. అనంతపురంలో మాజీ మంత్రి శైలజానాథ్ తో కలసి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన బొత్స ఈ మేరకు ఛాలెంజ్ చేశారు. అటు, ఏపీకి అన్యాయం జరిగిందని చెబుతున్న చంద్రబాబు... ఎన్డీయేతో భాగస్వామ్యం ఎలా కొనసాగిస్తున్నారని శైలజానాథ్ విమర్శించారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు కూడా కారకుడే అని చెప్పారు.