: ఆ నిర్ణయాన్ని చంద్రబాబుకే వదిలివేశారు!
ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసే నిర్ణయాన్ని పార్టీ అధినేతకే వదిలేశారు టీడీపీ నేతలు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల భేటీ కాసేపటి క్రితం ముగిసింది. అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరిని నిర్ణయించినా తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని అధినేతకు నేతలంతా చెప్పారు. ఈ సాయంత్రం టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్ ముగిసిన అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే బీదా రవిచంద్రయాదవ్, వివివి చౌదరిల పేర్లు ఖరారయినట్టు తెలుస్తోంది.