: లైంగిక దాడులు, వేధింపుల్లో మహారాష్ట్ర నెంబర్ వన్... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తృతీయ స్ధానం
మహిళలపై లైంగిక దాడులు, వేధింపుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచి అప్రదిష్ఠ మూటగట్టుకోగా, మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు సంబంధించిన వివరాలను కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ పార్లమెంటుకు వివరించారు. గత సంవత్సరం 13,827 కేసులతో మహారాష్ట్ర నెంబర్ వన్ గా నిలవగా, 13,323 కేసులతో మధ్యప్రదేశ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. 13,267 కేసులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో నిలిచింది. వీటిని అరికట్టేందుకు మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళల ఫిర్యాదులు స్వీకరించేందుకు సిబ్బందిని నియమించాలని ఆమె సూచించారు. అలాగే మహిళా అధికారుల సంఖ్యను పెంచాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.