: అమిత్ షాకు బట్టతల, సుష్మకు సాధారణ కేశాలంకరణ ఉంటుంది: పోలీస్ ప్రొఫార్మా


మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి ఎప్పుడూ ధోతీ, కుర్తా దానిపై 'జవహర్ జాకెట్' ధరించి, స్లిప్పర్లు వేసుకుని కనిపిస్తారట. ఇలా వాజ్ పేయి గురించిన వివరాలు ఆగస్టు 2009లో ప్రభుత్వ వెబ్ సైట్ లో పెట్టారు. అలాగే బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీల వివరాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏదైనా చదివేటప్పుడు కళ్లజోడు ధరిస్తారని 1998లో ఓ ఫామ్ లో పేర్కొన్నారు. అంతేగాదు, ఆమె ఆంగ్లం, హిందీ, ఇటలీ భాషలు మాట్లాడతారని ఫామ్ లో వివరించారు. అటు, ఈ ఏడాది బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రొఫార్మా విషయానికొస్తే, ఆయనకు బట్టతల, మీసం, గడ్డం ఉంటుందని, కుర్తా పైజామాలు ధరిస్తారని ఉంది. బీజేపీ నేత, ప్రస్తుత మంత్రి సుష్మా స్వరాజ్ చీర ధరించి, బొట్టు పెడతారని, సాధారణ కేశాలంకరణతో ఉంటారని పోలీస్ ప్రొఫార్మాలో ఉందట. ఇప్పుడిదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నారు అనుకుంటున్నారా? ప్రముఖ రాజకీయ నేతల భద్రతా కారణాల వల్ల వారి రూపం తదితర వ్యక్తిగత వివరాలను కేంద్ర ప్రభుత్వ పోలీస్ ప్రొఫైల్స్ లో రాస్తారు. ఈ మధ్య కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కళ్ల రంగు, జుట్టు రంగు, షూ సైజ్, హైటు వంటి వివరాలను పోలీసులు అడిగారట. ఆ నేత భద్రతా కారణాల దృష్ట్యానే అడిగినట్టు పార్లమెంటులో ఈరోజు కేంద్రం తెలిపింది. కానీ, రాహుల్ పై గూఢచర్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

  • Loading...

More Telugu News