: s/o సత్యమూర్తి ఆడియో వేడుకలో పరిమితికి మించి పాసులు... శ్రేయాస్ మీడియాపై కేసు?
సన్నాఫ్ సత్యమూర్తి మూవీ ఆడియో వేడుకలో అభిమానులు అసౌకర్యానికి గురయ్యారు. ఆడియో వేడుకను నిర్వహించిన శ్రేయాస్ మీడియా వేదిక సామర్థ్యాన్ని మించి పాసులు జారీ చేసింది. దీంతో, ఆడియో వేడుకలో చాలా మంది నిలుచుని వేడుకను తిలకించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో, ఆడియో వేడుకలో ఇబ్బందిపడ్డ అభిమానులు శ్రేయాస్ మీడియాపై కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్ కు ఆతిథ్యమిచ్చిన నోవాటెల్ హోటల్ యాజమాన్యం కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అదనంగా పాసులు జారీ చేయడం వల్ల వచ్చిన సందోహంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని నోవాటెల్ పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదైతే శ్రేయాస్ మీడియా ఇబ్బందుల్లో పడే ప్రమాదముందని సమాచారం.