: స్పీకర్ పోడియం ధ్వంసం చేసి, మైకులు విరగ్గొట్టారు... సస్పెండయ్యారు!
గత వారం కేరళ అసెంబ్లీలో దాడికి పాల్పడి గందరగోళం సృష్టించిన ఐదుగురు శాసనసభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మార్చి 13న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో అనుచితంగా ప్రవర్తించిన వామపక్ష సభ్యులు ఈపీ జయరాజన్, కేటీ జలీల్, వి. శివన్ కుట్టీ, కె.కుంజహ్మద్ మాస్టర్, కె.అజిత్ లను శాసనసభ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. కేరళ అసెంబ్లీలో పలువురు శాసనసభ్యులు బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకుని, స్పీకర్ పోడియం ధ్వసం చేసి, మైకులు విరిచేసి గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే.