: ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత పవనే... చిరంజీవిని ప్రస్తావించని దాసరి
అల్లు అర్జున్ కొత్త సినిమా సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా, దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ, తెలుగు సినీపరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ల తర్వాత అంతటి వాడు పవన్ కల్యాణ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఈ జాబితాలో ఉన్నది అల్లు అర్జున్ మాత్రమే అని చెప్పారు. ప్రస్తుత హీరోలంతా పవన్ కల్యాణ్ ను అనుకరిస్తుంటే... అల్లు అర్జున్ మాత్రం తనకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడని తెలిపారు. అల్లు రామలింగయ్య కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉందని... అందుకే ఈ ఫంక్షన్ కు వచ్చానని దాసరి తెలిపారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ తన చేతుల మీదే ప్రారంభమయిందని చెప్పారు. ఇంత భారీ స్పీచ్ ఇచ్చిన దాసరి... పరిశ్రమలోని గొప్ప హీరోల గురించి చెబుతున్నప్పుడు, మెగాస్టార్ చిరంజీవి పేరును కనీసం ఉచ్చరించకపోవడం గమనార్హం.