: అమ్మని, పవన్ కల్యాణ్ ని రమ్మని అడక్కూడదు: త్రివిక్రమ్ శ్రీనివాస్


అమ్మని, దేవుడ్ని రమ్మని అడక్కూడదని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. హైదరాబాదులో జరిగిన 'సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో వేడుకలో మాట్లాడుతూ, రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, అల్లు అర్జున్, సమంత లాంటి వారితో పనిచేయడం బాగుందని అన్నాడు. ఈ సమయంలో అభిమానులంతా పవన్ కల్యాణ్, పవన్ కల్యాణ్ అని అరవడంతో త్రివిక్రమ్... ఆడియో ఫంక్షన్ కు వచ్చే ముందు పవన్ కల్యాణ్ తో మాట్లాడానని, "ఎందుకు రాలేదని అడిగితే ఏం చెప్పాలి?" అని అడిగానని తెలిపాడు. దానికి పవన్ కల్యాణ్ "ఏం చెబుతావు?" అని అడిగారని అన్నారు. గతంలో తాను 'నువ్వే నువ్వే' సినిమాకి రాసిన డైలాగునే వాడుతానని చెప్పానని, ఇప్పుడు అదే చెబుతున్నానని 'అమ్మని, దేవుడ్ని రమ్మని అడగకూడదు... మనమే వెళ్లాలి' అని అన్నాడు. దీంతో, సభా ప్రాంగణం దద్దరిల్లేలా అభిమానులు కేరింతలు కొట్టారు.

  • Loading...

More Telugu News