: నువ్వేంటో నాకు తెలుసు... స్మృతీ ఇరానీని ఉద్దేశించి శరద్ యాదవ్ వ్యాఖ్య


దక్షిణాది మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకున్న శరద్ యాదవ్ మరోసారి నోటికి పనిచెప్పారు. మహిళల శరీర రంగుపై ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి స్మృతీ ఇరానీ డిమాండ్ చేయగా "నువ్వేంటో నాకు తెలుసు" అని యాదవ్ వ్యాఖ్యానించారు. దీంతో, పార్లమెంట్లో గందరగోళం చెలరేగింది. అంతకుముందు, ఇరానీ మాట్లాడుతూ, "మహిళల చర్మం రంగు గురించి ఎటువంటి కామెంట్లూ చేయవద్దు" అని కోరారు. రెండు రోజుల క్రితం "మీ దేవుడేమో నల్లన... మీ మేట్రిమోనియల్ ప్రకటనల్లో మాత్రం తెల్లని వధువులు కావలెను అని కోరతారు. దక్షిణాది మహిళలెంత అందంగా ఉంటారో వారి చర్మ సౌందర్యం కూడా అలాగే ఉంటుంది!" అని వ్యాఖ్యానించి విమర్శలను ఎదుర్కొన్న శరద్ యాదవ్ పార్లమెంట్ వేదికగా తన మాటలను సమర్థించుకోవడం గమనార్హం. తన వ్యాఖ్యలపై పార్లమెంటులో చర్చకు సిద్ధమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News