: తలసాని రాజీనామాపై ఏ నిర్ణయం తీసుకున్నారు?: స్పీకర్ ను ప్రశ్నించిన భట్టి


తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా సంగతి ఏమైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ, తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగం నిర్ధేశించిన హక్కులను పరిరక్షిస్తామని ప్రమాణం చేసిన వారే, ఫిరాయింపులను ప్రోత్సహించారని ఆయన విమర్శించారు. రాజ్యాంగ బద్దంగా విధులు నిర్వర్తించాల్సిన వారు వాటిని నిర్వర్తించాలని ఆయన స్పీకర్ కు సూచించారు. నిర్ణయం తీసుకోవాల్సిన వాటిని పెండింగ్ లో ఎందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News