: గేల్ వస్తాడు... కొడతాడు: విండీస్ కెప్టెన్ ధీమా


వరల్డ్ కప్ టోర్నీ నాకౌట్ దశకు రంగం సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో శ్రీలంక, బంగ్లాదేశ్ తో భారత్, ఆస్ట్రేలియాతో పాకిస్థాన్, న్యూజిలాండ్ తో వెస్టిండీస్ క్వార్టర్ ఫైనల్స్ లో తలపడనున్నాయి. కాగా, కివీస్ తో పోరుకు విండీస్ తహతహలాడుతోంది. అయితే, విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ ఫిట్ నెస్ పై ఇంకా స్పష్టత రాలేదు. వీపు నొప్పి కారణంగా ఆదివారం యూఏఈ జట్టుతో జరిగిన మ్యాచ్ కు గేల్ దూరంగా ఉన్నాడు. గేల్ కోలుకుని కివీస్ తో పోరుకు సిద్ధమవుతాడని విండీస్ శిబిరం ఆశాభావం వ్యక్తంచేస్తోంది. క్వార్టర్ ఫైనల్లో గేల్ కీలకమవుతాడని కెప్టెన్ జాసన్ హోల్డర్ అభిప్రాయపడ్డాడు. పూర్తిగా కోలుకోకున్నా గేల్ బరిలో దిగుతాడని అన్నాడు. కీలక మ్యాచ్ లలో కీలక ఆటగాళ్లు ఏం చేయగలరో తెలిసిన విషయమేనని పేర్కొన్నాడు. ఈ నెల 21న వెల్లింగ్టన్ లో న్యూజిలాండ్-వెస్టిండీస్ మ్యాచ్ జరగనుంది.

  • Loading...

More Telugu News