: హై స్పీడ్ ట్రాక్ వేసేందుకు కిలోమీటరుకు రూ.100 కోట్లకు పైగా ఖర్చవుతుంది: రైల్వే మంత్రి
కిలోమీటరు హై స్పీడ్ రైల్వే ట్రాక్ నిర్మాణానికి రూ.100 నుంచి 140 కోట్ల ఖర్చవుతుందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు లోక్ సభలో ఈరోజు తెలిపారు. ఈ క్రమంలో మొత్తం హై స్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు చేయడానికి రూ.80,000 కోట్లు అవసరమవుతాయని క్వశ్చన్ అవర్ లో వెల్లడించారు. ఇప్పటివరకు భారతీయ రైల్వేకు ఎలాంటి హై స్పీడ్ కారిడార్ లేదన్నారు. అయితే, పూణె-ముంబయి-అహ్మదాబాద్, ఢిల్లీ-ఆగ్రా-లక్నో-వారణాసి-పాట్నా, హౌరా-హల్దియా, చెన్నై-బెంగళూరు-కోయంబత్తూర్-ఎర్నాకుళం-తిరువనంతపురం వంటి కారిడార్లను సాధ్యత అధ్యయనాలకోసం గుర్తించినట్టు మంత్రి ప్రభు చెప్పారు. "భారత్, జపాన్ ఆర్థిక సహకారంతో 2013లో మొదలైన ముంబయి-అహ్మదాబాద్ హై స్పీడ్ కారిడార్ కు సంయుక్త సాధ్యతా అధ్యయనం చేస్తున్నాము. ఈ ఏడాది జూన్ లో ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని పేర్కొన్నారు.