: దుస్తులు బిగుతుగా ఉన్నాయని మహిళల ఫుట్ బాల్ మ్యాచ్ రద్దు


పశ్చిమ బెంగాల్ లో జరగాల్సిన ఓ మహిళల ఫుట్ బాల్ మ్యాచ్ రద్దయింది. దీనికి నిర్వాహకులు చెప్పిన కారణం దుమారం రేపుతోంది. అమ్మాయిల దుస్తులు బిగుతుగా ఉన్నాయని, వాటిని ధరించి ఆడితే పురుషుల్ని రెచ్చగొట్టినట్టవుతుందని ఏకంగా మ్యాచ్ నే రద్దు చేయడం విమర్శలకు దారితీసింది. మల్దా జిల్లాలోని చండీపూర్ లో స్థానిక ఫుట్ బాల్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా కోల్కతా, ఉత్తర బెంగాల్ మహిళా ఫుట్బాల్ జట్ల మధ్య మ్యాచ్ జరపాలని భావించి ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజు నిర్వాహకుడు రేజా రజీర్ పై మతపరంగా చర్యలు తీసుకుంటామని కొందరు వ్యక్తులు హెచ్చరించారట. దీంతో ఆయన వెనక్కు తగ్గారు. ఈ మ్యాచ్ జరిగితే మత ఘర్షణలు తలెత్తే అవకాశం ఉన్నందునే మ్యాచ్ ఆపినట్టు అధికారులు తెలిపారు. ఈ ఉదంతంపై కొన్ని రాజకీయ పార్టీలు నిరసనను తెలపగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ మంత్రి సావిత్రి మిశ్రా మాత్రం దుస్తుల కారణంగా మ్యాచ్ రద్దు చేయడాన్ని సమర్థించడం గమనార్హం.

  • Loading...

More Telugu News