: టాప్ ఎకానమీగా భారత్ కు ఛాన్స్... ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టినా వ్యాఖ్య


ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో అగ్రగామిగా ఎదిగేందుకు భారత్ కు అవకాశాలున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టినా లగార్డే అన్నారు. అయితే ప్రణాళికాబద్ధమైన చర్యలతో భారత్ ముందుకెళ్లాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం ఆమె కొద్దిసేపటి క్రితం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రపంచంలోనే డైనమిక్ ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్ కు మెరుగైన అవకాశాలున్నాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలతో భారత్ శరవేగంగా వృద్ధి సాధించనుందని ఆమె పేర్కొన్నారు. మరింత మంది మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా మరింత మేర వృద్ధి సాధ్యమవుతుందని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News