: మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు... న్యాయస్థానాలకు శివసేన సలహా


మతపరమైన నమ్మకాలు, విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని, అలా ఉంటేనే మంచిదని దేశంలోని కోర్టులకు శివసేన సలహా ఇచ్చింది. ముంబైలో బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో మండపాలను, ఉత్సవాలను నిషేధిస్తూ ఇటీవల ముంబై హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దానిపై పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో సేన విమర్శలు చేసింది. "మత నమ్మకాలకు సంబంధించి అంశాలలో జోక్యం చేసుకోవద్దు. దానివల్ల గణేష్ ఉత్సవం, నవరాత్రి, దహీహండి, శివ జయంతి వంటి హిందువుల పండుగల సంస్కృతి దెబ్బతింటుంది. ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ అభిప్రాయాన్ని మొత్తం ప్రజల అభిప్రాయంగా కోర్టు ఎలా పరిగణిస్తుంది?" అని అడిగింది. ఎలాంటి ఉత్సవాలు, పండుగలు లేనప్పుడు కూడా దేశ వ్యాప్తంగా వచ్చిపోయే జనాలతో ముంబయి నగరం ఏడాదిపొడవునా అత్యంత రద్దీగా ఉంటుందని సేన పేర్కొంది. ఈ క్రమంలో భారీగా వచ్చి పడుతున్న వలసలను కోర్టులు కట్టడి చేయగలవా? అని ప్రశ్నించింది. జాతీయ పండుగలను, ఉత్సవాలను నిషేధించడం అంటే ప్రజల్లోని స్పూర్తిని చంపి వేయడమేనని తెలిపింది. కావున కోర్టుల ప్రజలందరికీ న్యాయం జరిగేలా వ్యవహరించాలని సలహా ఇచ్చింది.

  • Loading...

More Telugu News