: జగన్ ను ఎర్రగడ్డకు తరలించాలి... లేదంటే సెంట్రల్ జైలుకైనా పంపాలి: గోరంట్ల బుచ్చయ్య
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోమారు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వితండవాదం చేస్తున్న జగన్ ను ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని వ్యాఖ్యానించిన గోరంట్ల, అవసరమైతే సెంట్రల్ జైలుకు పంపాలన్నారు. జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు జ్ఞానోదయం కలిగేలా చూడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని గోరంట్ల వ్యాఖ్యానించారు. గోరంట్ల వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.