: అనంతపురం జిల్లాలో మోదీ దిష్టిబొమ్మ దహనం


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై సీపీఐ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల కిందట అనంతపురం జిల్లా బంద్ కు పిలుపునివ్వగా, తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను ఆ పార్టీ దగ్ధం చేసింది. జిల్లాలోని కనగానపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రధాని దిష్టిబొమ్మను సీపీఐ కార్యకర్తలు దహనం చేశారు. తక్షణం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, లేదంటే తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News