: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు
టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఎంఐఎం పేరుగాంచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, టీఎస్ ప్రభుత్వంపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో అక్బర్ మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై పెదవి విరిచారు. గత ఏడాది బడ్జెట్ నే కాపీ చేసి పేస్ట్ చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర నుంచి వచ్చే గ్రాంట్ లను కూడా భారీగా పెంచి చూపించారని మండిపడ్డారు. ఇంత ఎక్కువగా గ్రాంట్లు వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అక్బర్ వ్యాఖ్యలతో సభలో టీఆర్ఎస్ నేతలు కొంత ఇబ్బందికి గురయ్యారు.