: వైసీపీ నేతలు రాయలసీమ ద్రోహులు... జగన్ పై ఏపీ మంత్రుల ఫైర్


ఏపీ అసెంబ్లీలో మరోమారు మాటల యుద్ధం చోటుచేసుకుంది. వైసీపీ నేతలపై మాటల దాడి చేసిన మంత్రులు, వారిని రాయలసీమ ద్రోహులుగా అభివర్ణించారు. కీలక అంశాలపై చర్చకు సరిపడ సమయం ఇవ్వడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ తీరునూ జగన్ ప్రశ్నించారు. ఇష్టమొచ్చినంత సేపు మాట్లాడతానంటే కుదరదని స్పీకర్ కోడెల కూడా జగన్ కు ఘాటుగానే సమాధానమిచ్చారు. దీంతో వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం ను చుట్టుముట్టారు. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నేతలపై మంత్రి అచ్చెన్నాయుడు, మృణాళిని, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు రాయలసీమ ద్రోహులంటూ మంత్రులు ఆరోపించారు. దీంతో గందరగోళం నెలకొనడంతో సభను స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News