: బాబు సర్కార్ పూర్తి కాలం ఉండదు... స్వరూపానంద స్వామి సంచలన వ్యాఖ్యలు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భగవంతుడి ఆశీస్సులు లేవని, శ్రీరామ నవమి వేడుకల నిర్వహణపై బాబు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి వ్యాఖ్యానించారు. ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, భగవంతుడి ఆశీస్సులు లేకపోతే ప్రభుత్వం ఐదేండ్ల పాటు అధికారంలో ఉండదని హెచ్చరించారు. సమర్థవంతంగా పాలించాలన్న ఆలోచన ఉంటే, ఆధ్మాత్మిక కార్యక్రమాల నిర్వహణపై పీఠాధిపతులు, మఠాధిపతులు, పండితులు, అర్చకులు, ఆచార్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు కేవలం అధికారులను మాత్రమే చర్చల్లో భాగం చేయడం ప్రభుత్వ దుర్నీతికి, దుర్మార్గానికి నిదర్శనమన్నారు. ఆధ్యాత్మిక విషయాల్లో స్వీయ నిర్ణయాలు దేశానికి అరిష్టమని, గోదావరి తీరాన మార్కండేయ స్వామి ఆలయం కూల్చివేతకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News