: భగత్ సింగ్ స్వగ్రామాన్ని దత్తత తీసుకున్న కేంద్రం


స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ స్వగ్రామం ఖత్కర్ కలాన్ ను అభివృద్ధి చేయాలని కేంద్రం తలంచింది. ఈ క్రమంలో అదర్శ గ్రామ పథకంలో భాగంగా ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంది. ఆ గ్రామానికి మౌలిక వసతుల ఆధారంగా కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక సందర్భాననుసరించి ఆ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి బిరేందర్ సింగ్ చెప్పారు. దానిపై అనంద్ పూర్ ఎంపీ ప్రేమ్ సింగ్ చందుమజ్రా మాట్లాడుతూ, ఆ అమరవీరుడి గ్రామాన్ని తాను దత్తత చేసుకోవాలనుకున్నానని, కానీ పథకంలో పేర్కొన్న కేంద్రం మార్గనిర్దేశికాలను అనుసరించి తీసుకోలేకపోయానని తెలిపారు. త్వరలో ఆ గ్రామంలో కేంద్ర అధికారులు పర్యటించనున్నారు.

  • Loading...

More Telugu News