: శరద్ వ్యాఖ్యలపై రాజ్యసభలో రభస... విత్ డ్రా చేసుకోవాలన్న బీజేపీ, కుదరదన్న యాదవ్


దక్షిణాది మహిళలపై జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజ్యసభలో కొద్దిసేపటి క్రితం రభస జరిగింది. నల్లగా ఉండే దక్షిణాది మహిళలు, అందంగా కూడా ఉంటారని మొన్నటి సమావేశాల్లో శరద్ యాదవ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. శరద్ వ్యాఖ్యలపై నాడు వెనువెంటనే డీఎంకే ఎంపీ కనిమొళి సహా మహిళా సభ్యులతో పాటు పలు పార్టీలకు చెందిన పురుష ఎంపీలు కూడా అభ్యంతరం తెలిపారు. కొద్దిసేపటి క్రితం సభ ప్రారంభం కాగానే, శరద్ యాదవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని వాదించిన శరద్ యాదవ్, వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీంతో బీజేపీ సహా ఇతర పార్టీల ఎంపీలు శరద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

  • Loading...

More Telugu News