: ఏపీ శాసనసభలో సీఆర్డీఏ సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నవ్యాంధ్ర రాజధానికి సంబంధించిన సీఆర్డీఏ సవరణ బిల్లును ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టింది. ఇందులో మూడు సవరణలు ప్రతిపాదిస్తూ మంత్రి అయ్యన్నపాత్రుడు బిల్లు పెట్టారు. ఈ సవరణలకు ప్రతిపక్షం మద్దతు తెలిపితే బిల్లు ఆమోదం పొందనుంది. ఇదిలాఉంటే కొన్ని రోజుల కిందట సీఆర్డీఏ కింద ప్రభుత్వ భూసేకరణ ముగియగా, మొత్తం 33వేల ఎకరాలను సేకరించారు.