: కాంగ్రెస్ వల్లే విభజనలో తెలంగాణకు తీరని అన్యాయం... హరీష్ వ్యాఖ్యలతో అట్టుడికిన టి.అసెంబ్లీ
తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలోకి వెళ్లడం, లోయర్ సీలేరు ప్రాజెక్టును ఏపీకి కేటాయించడంలో కాంగ్రెస్ హస్తం కూడా ఉందని టీఎస్ మంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. రాజ్యసభలో సంఖ్యాబలం ఉండి కూడా కాంగ్రెస్ వీటిని అడ్డుకోలేదని ఆరోపించారు. లోయర్ సీలేరు ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ వల్లే ఏపీకి వెళ్లిందని విమర్శించారు. పార్లమెంటులో బీజేపీ బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుకోలేకపోయిందని ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేషే దీనికంతటికీ కారణమని మండిపడ్డారు. ఏడు ముంపు మండలాలు, లోయర్ సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలపడంపై కాంగ్రెస్ సభ్యుడు పువ్వాడ అజయ్ అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ, హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. లోయర్ సీలేరు ప్రాజెక్టు కోసం ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.