: ఉపాధ్యాయుల మధ్య విభేదాలు పాఠశాల ఫర్నిచర్ ను విరగ్గొట్టాయి!


విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పారు. సఖ్యతగా ఉంటూ పాఠశాలను సక్రమంగా నడపాల్సిన వారు కీచులాడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సీన్ కట్ చేస్తే, పాఠశాలలోని ఫర్నిచర్ ధ్వంసమైంది. సమాచారమందుకున్న పోలీసులు అసలు విషయం తెలియడంతో నోరెళ్లబెట్టారు. కర్నూలు జిల్లా గడివేముల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేటి ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. గుర్తు తెలియని దుండగుల దాడిలో ఫర్నిచర్ ధ్వంసమైందన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసుల ప్రాథమిక విచారణలో ఉపాధ్యాయుల మధ్య విభేదాలే ఈ దుశ్చర్యకు కారణమని తేలింది.

  • Loading...

More Telugu News