: బాబు సర్కారును 'కడగనున్న' జగన్!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ పై మరికాసేపట్లో చర్చ జరగనుంది. విపక్షనేతగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బడ్జెట్ పై చర్చను ప్రారంభించనున్నారు. నాలుగు రోజుల ముందు బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత జగన్ మాట్లాడుతూ, బడ్జెట్ ప్రసంగం సందర్భంగా అధికార పార్టీని కడిగి పారేస్తానని హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అసెంబ్లీలో ఏ విధమైన వైఖరితో ముందుకు వెళ్తారన్న ఆసక్తి నెలకొంది. కాగా, ప్రతిపక్షంపై ఎదురు దాడి చేసేందుకు కొంతమంది మంత్రులను ఎంపిక చేసినట్టు సమాచారం.