: కృష్ణా నదిలో కొట్టుకుపోయిన బల్లకట్టు... ప్రయాణికుల హాహాకారాలు


నదిని దాటేందుకు ఏర్పాటు చేసుకున్న బల్లకట్టుకు కట్టిన మోపుతాడు ఊడిపోవడంతో, సుమారు 100 మందికి పైగా జనం గంటపాటు ప్రాణాలు అరచేత పట్టుకొని ఆర్తనాదాలు చేశారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలంలోని పుట్లగుడెం కృష్ణా రేవులో జరిగింది. రామన్నపేట వైపు నుంచి పుట్లగూడెం రావడానికి బల్లకట్టును సిద్ధం చేయగా, మోపుతాడు ఊడి గాలివాటంగా సుమారు కిలోమీటరు దూరం కొట్టుకుపోయిన బల్లకట్టు తాడువాయి, మాదిపాడు గ్రామాల మధ్య ఉన్న రాళ్లలో ఇరుక్కుపోయింది. ఈ బల్లకట్టుపై ఒక లారీ, మూడు ఆటోలు, ఒక కారు, 20 వరకు ద్విచక్ర వాహనాలతో పాటు మరో 150 మంది వరకు జనం ఉన్నారు. బల్లకట్టు నదిలో కొట్టుకుపోతుంటే భయంతో ప్రయాణికులు పెద్దఎత్తున ఆర్తనాదాలు చేశారు. తరువాత మరో బల్లకట్టును తీసుకువచ్చి ఇరుక్కుపోయిన బల్లకట్టుకు కట్టి పుట్లగూడెంకు చేర్చడంతో, అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News