: చల్లగాలి కోసమెళితే బంగారం నిధి దొరికిందట!


ఆస్ట్రేలియాలోని కెరాంగ్ కు చెందిన మిక్ బ్రౌన్ అనే వ్యక్తికి లక్ కలిసొచ్చింది. భార్య చీవాట్లతో సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్న ధూమపానాన్ని అతడు ఇటీవలే వదిలేశాడు. అయినా భార్య సతాయింపులు తప్పలేదు. ఎందుకంటే, ధూమపానం మానేసిన అతడు నిత్యం ఇంటిలోనే కూర్చుంటున్నాడట. 'అలా చల్లగాలి కోసమైనా బయటకెళ్లరాదు' అంటూ భార్య చెప్పడంతో, తనకలవాటైన బంగారం అన్వేషణతోనూ కాసింత కాలక్షేపం చేద్దామని అతడు బయలుదేరాడట. తనవద్ద ఉన్న ప్రత్యేక పరికరంతో అన్వేషణ సాగిస్తున్న అతడికి భారీ బంగారం నిధి దొరికింది. భూమికి కేవలం 15 సెంటీ మీటర్ల లోతులో 2.7 కిలోల బంగారం ముద్దలు దొరికాయి. వీటి విలువ ఎంతలేదన్నా 1.4 లక్షల డాలర్లుంటుందట.

  • Loading...

More Telugu News