: పైన షేర్వాణీ... లోపల పరేషానీ: హైదరాబాదుపై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్య
భాగ్యనగరి హైదరాబాదుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. నిన్న నగరంలోని నాగోల్ లో పర్యటించిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు హైదరాబాదు దుస్థితిని కళ్లకు కట్టేలా ఉన్నాయి. ‘‘హైదరాబాదును చూస్తే పైన షేర్వాణీ... లోపల పరేషానీలా అన్నట్లుగా ఉంది. ఏ బస్తీలోకి తొంగిచూసినా మురికి కూపాలు, చెత్త డంపులే దర్శనమిస్తున్నాయి. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మన వీధులను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాదును 330 విభాగాలుగా విభజిస్తాం. బస్తీలను అధికారులకు అప్పగిస్తాం. నేనూ ఓ బస్తీని దత్తత తీసుకుంటా. బస్తీ సమస్యలపై కలిసికట్టుగా పోరాడదాం. ప్రతి బస్తీని కూకట్ పల్లి సమీపంలోని ప్రగతి నగర్ లా తీర్చిదిద్దుకుందాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.