: 'జులాయి' కన్నా ఇది నాలుగింతలు బాగుంటుంది: రాజేంద్రప్రసాద్


'జులాయి' కన్నా నాలుగింతలు 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా బాగుంటుందని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'జులాయి' సినిమా కంటే ఈ సినిమా బాగుంటుందని, అభిమానులు నిశ్చింతగా నిద్రపోవచ్చని చెప్పారు. అల్లు అర్జున్ తో సినిమా చేసినందుకు తనను కూడా కేరళలో గుర్తు పడుతున్నారని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కంటే కూడా కేరళలో అల్లు అర్జున్ కు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని చెప్పారు. మాటల మాంత్రికుడి దర్శకత్వంలో తన పెట్ అర్జున్ తో నటించడం ఆనందంగా ఉందని రాజేంద్రప్రసాద్ అన్నారు.

  • Loading...

More Telugu News