: స్విస్ ఓపెన్ కైవసం చేసుకున్న కిదాంబి శ్రీకాంత్


భారత బ్యాడ్మింటన్ యువ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ స్విస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. స్విస్ గ్రాండ్ ప్రి గోల్డ్ ఓపెన్ ఫైనల్లో శ్రీకాంత్ భారత సత్తా చాటాడు. శ్రీకాంత్ 21-15, 12-21, 21-14 స్కోరుతో డెన్మార్క్ కు చెందిన విక్టోర్ అలెక్సన్ ఓడించి స్విస్ ఓపెన్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో తొలి సెట్ ను సునాయాసంగా గెలుచుకున్న శ్రీకాంత్, రెండో సెట్ కోల్పోయాడు. తిరిగి మూడో సెట్ లో జూలు విదిల్చి పుంజుకోవడంతో కేవలం 47 నిమిషాల్లో గేమ్ ను ముగించాడు. దీంతో టైటిల్ శ్రీకాంత్ వశమయ్యింది.

  • Loading...

More Telugu News