: తెలుగు ప్రేక్షకుల అభిమానం మర్చిపోలేను: అదాశర్మ


తెలుగు సినీ ప్రేక్షకులు చూపించిన ఆదరాభిమానాలు మర్చిపోలేనని 'హార్ట్ ఎటాక్' ఫేమ్ అదాశర్మ తెలిపింది. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా ఆడియో వేడుకలో పాటను విడుదల చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనను తెలుగు ప్రేక్షకులు ఆదరించారని చెప్పింది. తొలి సినిమాతోనే నటీ నటులను ఆదరించడం కొన్ని సందర్భాల్లోనే జరుగుతుందని, తెలుగు ప్రేక్షకులు మాత్రం తనను తొలి సినిమాతోనే ఆదరించారని పేర్కొంది. 'సన్నాఫ్ సత్యమూర్తి'లో కూడా తన పాత్ర ఆకట్టుకుంటుందని తెలిపింది. ఉచ్చారణ దోషం లేని చక్కని తెలుగులో మాట్లాడి అభిమానులందర్నీ అలరించింది. ఆమె చక్కగా తెలుగులో మాట్లాడడంతో అభిమానులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. సినిమాలో మూడవ పాటను ఆవిష్కరించి అలరించింది.

  • Loading...

More Telugu News