: కేరళలో ఎల్ డీఎఫ్ ఎమ్మెల్యేలపై కేసు నమోదు
కేరళ శాసనసభలో బడ్జెట్ సమర్పణ సందర్భంగా ఈ నెల 13న జరిగిన గందరగోళం నేపథ్యంలో కొందరు ఎల్ డీఎఫ్ ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేశారు. శాసనసభ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కొంత మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఆనాటి ఆందోళన కారణంగా శాసనసభలో 5 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, అదే శాసనసభలో ఓ మహిళా ఎమ్మెల్యే నడుంపై ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యే చేయివేసినట్టు తెలుస్తోంది.