: కార్ షెడ్ లో ఎగసిపడ్డ మంటలు...ఆర్పుతున్న 6 ఫైరింజన్లు


హైదరాబాదు, నాంపల్లిలోని బజార్ ఘాట్ సమీపంలోని విజయనగర్ కాలనీలో ఉన్న కార్ల షెడ్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ శబ్దంతో, మంటలు వ్యాపించిన సంఘటన చోటుచేసుకుంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. విషయం తెలియక పరుగులు పెట్టారు. ఇంతలో మంటలు ఇతర షెడ్లకు వ్యాపించాయి. ప్రస్తుతానికి నాలుగు షెడ్లలో మంటలు చెలరేగుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఆరు అగ్నిమాపక యంత్రాల సిబ్బంది, మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. నష్టం అంచనా వేయాల్సి ఉంది.

  • Loading...

More Telugu News