: గోవాలో గాంధీ జయంతికి సెలవు లేదు...తప్పిదమా? నిర్ణయమా?
గోవాలో అధికార బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వెలువరించే పబ్లిక్ హాలిడేస్ లిస్టు నుంచి గాంధీ జయంతిని తొలగించడంతో కలకలం రేగుతోంది. నిన్న విడుదల చేసిన అధికారిక క్యాలెండర్లలో గాంధీ జయంతి నాడు సెలవుగా ప్రకటించలేదు. దీంతో గోవా ప్రభుత్వంపై స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా? లేక అచ్చు తప్పా? అన్నది తెలియాల్సి ఉంది.